![]() |
![]() |

ఆట లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎపిసోడ్ ఎంట్రీలోనే సుధీర్ నిహారికకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఒక కవిత రాసుకుని వచ్చాడు. "అంతుందేంటీ మ్యాటరు" అని నిహారిక అడిగేసరికి "నా గుండెల్లోంచి వచ్చిన పదాలన్నీ కలిపి రాసాను " అన్నాడు. "నిహారిక ఓ నిహారిక అడక్కుండానే ఆట ఇచ్చావ్, అడుగుదామనేలోపే బేటా ఇచ్చావ్. టాలెంట్ కి అద్భుతమైన వేదికనిచ్చావ్, దానికి జడ్జ్ గా రాధికనిచ్చావ్, షూట్ చేయడానికి కెమేరానిచ్చావ్, వెయిట్ చేయడానికి కారవనిచ్చావ్ , చెమట పడితే టచ్ఛప్ ఇచ్చావ్, చీకటి పడితే ప్యాకపిచ్చావ్" అని సుధీర్ చెప్పేసరికి "నాకెందుకు దేవుడా ఇదంతా వినడానికి చెవులిచ్చావ్ " అంటూ నిహారికా కౌంటర్ ఇచ్చింది.
"నిహారికా దారి లేని వాళ్లకు కొత్త మార్నింగ్ ని ఇచ్చావ్, దారి తప్పుతున్న నాకు వార్నింగ్ ని ఇచ్చావ్ , అందుకే నువ్వు నాకు నచ్చావ్ నచ్చావ్ నచ్చావ్ " అంటూ సుధీర్ చాలా మంచి కవిత చెప్పాడు. "ఇది కవిత్వం కాదు కపిత్వం " అని చెప్పింది. ఇక తర్వాత ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి ఫన్నీ గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ నవ్వించారు. జడ్జ్ రాధ ఇరేజర్ , రఘు మాష్టర్ గరిటె , కావ్య బూజు దులుపుకుని కర్రలు, సమీరా భరద్వాజ్ జెండా కర్రలు, విష్ణు ప్రియా ఖాళి వైట్ పేపర్ తెచ్చి ఇచ్చింది.
![]() |
![]() |